G. Kishan Reddy: అందుకే పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చాం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
- పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌ల్లో హిందువులకు హక్కులు కల్పించడం లేదు
- 3 దేశాల్లో అణచివేతకు గురైనవారు భారత్‌కు శరణార్థులుగా వచ్చారు
- శరణార్ధుల కోసమే సీఏఏ
- పాక్ పౌరుల కోసమే పలు పార్టీల నేతలు సీఏఏను వ్యతిరేకిస్తున్నారా?
పౌరసత్వ సవరణ చట్టంపై వస్తోన్న విమర్శలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో హిందువులకు హక్కులు కల్పించడం లేదని ఆయన చెప్పారు. ఆయా దేశాల్లో అణచివేతకు గురైనవారు భారత్‌కు శరణార్థులుగా వచ్చారని చెప్పారు. శరణార్ధుల కోసమే తాము సీఏఏ తీసుకొచ్చామని వివరించారు.
ఈ చట్టంతో దేశ పౌరులకు జరుగుతోన్న అన్యాయమేంటో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాక్ పౌరుల కోసమే సీఏఏను వ్యతిరేకిస్తున్నారా? అని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. మతం పేరుతో ఓట్లు దండుకోవాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాల్లో చేస్తోన్న ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.