Under-19 cricket world cup: అండర్-19 క్రికెట్ ప్రపంచకప్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా ఫైనల్ మ్యాచ్
- మరోమారు కప్ సొంతం చేసుకోవాలని చూస్తున్న భారత్
- ఈ మ్యాచ్ ను తిలకించేందుకు ఆసక్తితో అభిమానులు
అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ లు ఈ రోజు తలపడనున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలోని పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా ఇరు దేశాలు తలపడనున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పోరులో విజయం సాధించి మరోమారు అండర్-19 ప్రపంచకప్ ను తన ఖాతాలో వేసుకోవాలని భారత్ జట్టు చూస్తోంది. ఈ పోరును తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, 2000, 2008, 2012, 2018లో అండర్-19 ప్రపంచ కప్ ను భారత్ సాధించింది. 2006, 2016లో టీమిండియా రన్నరప్ గా నిలిచింది.
భారత్ జట్టు : ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దివ్యాంశ్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, సిద్దేశ్ వీర్, అథర్వ, రవి బిష్ణోయ్, శస్వాత్, కార్తీక్ త్యాగి, ఆకాశ్ సింగ్
బంగ్లాదేశ్ జట్టు : అక్బర్ అలీ (కెప్టెన్), పర్వేజ్, తన్ జీద్, మహ్మదుల్ హసన్, తౌహిద్, షహాదత్, అవివేక్ దాస్, షమీమ్, రకీబుల్, షోరిపుల్ ఇస్లామ్, హసన్ షకిబ్