RTI: ఆర్టీఐ కమిషనర్‌గా 'నమస్తే తెలంగాణ' సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి!
- ఆర్టీఐ కమిషనర్ల పదవికి మొత్తం 130 మంది దరఖాస్తు
- వివిధ అంశాల ఆధారంగా 8 మంది ఎంపిక
- నియామకాల కోసం గవర్నర్‌కు సిఫారసు
తెలంగాణ సమాచార హక్కు చట్టానికి (ఆర్టీఐ) కొత్తగా 8 మంది కమిషనర్లు రానున్నారు. వీరిలో నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకుడు కట్టా శేఖర్ రెడ్డి ఒకరు కాగా, మిగతా వారిలో రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పీకే ఝా, 'టీ న్యూస్' సీఈఓ నారాయణరెడ్డి, గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గుగులోతు శంకర్‌నాయక్, రచయిత్రి రావులపల్లి సునీత, ఇద్దరు మైనారిటీ, మరో ఇద్దరు న్యాయవాదులు ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లతో కూడిన కమిటీ నిన్న ప్రగతి భవన్లో సమావేశమై వీరిని ఎంపిక చేసింది. అనంతరం వీరి నియామకాల కోసం గవర్నర్‌కు సిఫారసు చేసింది. కాగా, ఈ పోస్టులకు మొత్తం 130 మంది దరఖాస్తు చేసుకోగా, వివిధ అంశాల ప్రాతిపదికన పై 8 మందినీ ఎంపిక చేశారు.