sleep: పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే మేధాశక్తి తగ్గుదల.. మానసిక సమస్యలు
- చిన్నారుల నిద్ర, మెదడులో మార్పులపై పరిశోధనలు
- పలు విషయాలు గుర్తించిన యూకేలోని వార్విక్ వర్సిటీ పరిశోధకులు
- కంటినిండా నిద్రపోకపోతే మెదడులో నిర్మాణాత్మక మార్పులు
నిద్ర ఒత్తిడిని దూరం చేస్తుంది.. మనసు తేలికపడేట్లు చేస్తుంది. అలాగే పిల్లల ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా ముఖ్యమన్న విషయాన్ని తల్లిదండ్రులు మరచిపోకూడదు. చిన్నారులు కంటినిండా నిద్రపోకపోతే మెదడులో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని పరిశోధకులు తేల్చారు.
9 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న 11,000 మంది చిన్నారులు రోజూ ఎంత సేపు నిద్రపోతున్నారనే విషయంపై యూకేలోని వార్విక్ వర్సిటీ పరిశోధకులు వివరాలు సేకరించారు. వారి మెదళ్లలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయన్న విషయంపై అధ్యయనం చేశారు. పిల్లలు కంటినిండా నిద్రపోకపోతే వారి మేధాశక్తి తగ్గుతుందని, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. కాబట్టి పిల్లలు నిద్రకు దూరంగా కాకుండా చూడాలని సూచిస్తున్నారు.