ips: సివిల్స్, పారా మిలటరీ బలగాలకు ఒకే ఎగ్జామ్

  • కామన్ ప్రిలిమినరీ పరీక్షకు యూపీఎస్సీ నిర్ణయం
  • రెండింటికీ కలిపి ప్రిపేరయ్యేందుకు చాన్స్

సీఆర్పీఎఫ్ సహా దేశవ్యాప్తంగా ఉన్న పారా మిలటరీ బలగాలలో ఆఫీసర్ ఎంట్రీ ఉద్యోగాలు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీసులకు ఒకే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటివరకు వేర్వేరుగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షలను కలిపేయాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ అధికారులు పీటీఐ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీ తదితర పారా మిలటరీ బలగాలకు గ్రూప్-ఎ సర్వీస్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని పారా మిలటరీ బలగాలకు ఒకే రిక్రూట్ మెంట్, ఒకే తరహా సిలబస్ ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే యూపీఎస్సీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లకు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షను వీటికి కూడా కలిపి చేపట్టాలని ప్రతిపాదించారు. ఇది త్వరలోనే అమల్లోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ఈ కామన్ పరీక్ష వల్ల సివిల్స్ కోసం ప్రిపేరయ్యేవాళ్లు పారా మిలటరీలో, పారా మిలటరీకి ప్రిపేరయ్యే వాళ్లు సివిల్స్ లో చాన్స్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News