Sensex: కరోనా వైరస్ దెబ్బకు డీలా పడిన మార్కెట్లు
- 900 దాటిన కరోనా వైరస్ మృతుల సంఖ్య
- 162 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 66 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. కరోనా వైరస్ మృతుల సంఖ్య 900 దాటడం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీలు... ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 40,979కి పడిపోయింది. నిఫ్టీ 66 పాయింట్లు కోల్పోయి 12,031 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.51%), టీసీఎస్ (1.20%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.04%), ఏసియన్ పెయింట్స్ (0.62%), హెచ్డీఎఫ్సీ (0.27%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-7.16%), టాటా స్టీల్ (-5.80%), ఓఎన్జీసీ (-2.84%), సన్ ఫార్మా (-2.39%), హీరో మోటో కార్ప్ (-2.34%).