Kanna Lakshminarayana: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఖండిస్తున్నాం: కన్నా లక్ష్మీనారాయణ
- ఏపీ రివర్స్ గేర్ లో వెళుతోంది
- మధ్య తరగతి వారిపై పెనుభారం పడుతుంది
- వైసీపీ సర్కార్ ‘తుగ్లక్’ పనులతో ప్రజల నడ్డి విరుస్తోంది
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఏపీ రివర్స్ గేర్ లో వెళుతోందని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్య తరగతి కుటుంబాల వారిపై పెనుభారం పడుతుందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలో తెలియక వైసీపీ ప్రభుత్వం ‘తుగ్లక్’ పనులతో ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.