Telangana: తెలంగాణలో పంట పండింది.. రికార్డు స్థాయిలో దిగుబడులు
- ధాన్యం దిగుబడిలో రికార్డు
- 2019-20 కాలానికి 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి
- ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులు తోడ్పడ్డాయి
తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తర్వాత వ్యవసాయ దిగుబడులు ఊపందుకున్నాయి. 2019-20 కాలానికి గాను రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ దిగుబడులు వచ్చాయని ఆర్థిక గణాంక శాఖ తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా దిగుబడులు సాధించడం ఒక రికార్డు అని ఆ శాఖ వెల్లడించింది.
ఒక్క వరి పంట దిగుబడులను గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సారీ 66 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు దిగుబడి సాధించి రికార్డు సృష్టించిందని గణాంక శాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో 1.3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తిని సాధించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ.. కారణంగా వ్యవసాయంలో దిగుబడులు పెరిగాయని విశ్లేషకులంటున్నారు.