APSRTC: డిమాండ్ల పరిష్కారం కోసం.. నేడు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్ష!

APSRTC EU called for mass hunger strike across all depots
  • ఆర్టీసీ ఎండీపై మండిపడుతున్న ఈయూ నేతలు
  • నేడు 128 డిపోలు, వర్క్‌షాపుల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు
  • ఉన్న సౌకర్యాలు తొలగిస్తున్నారని ఆరోపణ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెబుతూ మరోవైపు, ఉన్న సౌకర్యాలను తొలగిస్తున్నారని ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఎండీ తీసుకున్న పలు నిర్ణయాలను వ్యతిరేకించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్.. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈయూ ఆధ్వర్యంలో 128 డిపోలు, వర్క్‌షాపుల వద్ద కార్మికులు నేడు సామూహిక నిరాహార దీక్షలకు దిగనున్నారు.

ఈయూ నేత దామోదర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఎండీ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు. కాంట్రాక్టు డ్రైవర్, కండక్టర్ల నియామకాలను వెనక్కి తీసుకోవాలని, ఎస్ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ ట్రస్ట్‌లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ రూట్లలో స్కూలు బస్సులను తిప్పుకునేందుకు అనుమతించడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు దామోదర్ తెలిపారు.
APSRTC
EU
Hunger strike
Andhra Pradesh

More Telugu News