Kerala: ఇదో విచిత్రం.. ఒంటెపై పెళ్లి మండపానికి వచ్చి పెళ్లికొడుకు నిరసన.. ఫొటో వైరల్
- కేరళలో ఘటన
- సీఏఏపై నిరసన
- 20 కిలోమీటర్లు ఒంటెపై ఊరేగింపు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కేరళలో వాటిని అమలు చేయబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో సీఏఏపై ఓ పెళ్లికొడుకు వినూత్నంగా నిరసన తెలిపి అందరి దృష్టినీ ఆకర్షించాడు.
హజా హుస్సేన్ అనే వ్యాపారి నిన్న పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కొడుకుగా తయారై తిరువనంతపురం నుంచి వాజిమక్కులోని వివాహ వేదిక ( 20 కిలోమీటర్లు) వరకు అతడు ఒంటెపై ఊరేగింపుగా బయలుదేరాడు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతడి బంధువులంతా అతడి వెంట వెళ్లారు. దీంతో అతడు ఊరేగిన ప్రాంతాల్లో రోడ్లన్నీ రద్దీగా కనపడ్డాయి. అంతేకాదు, తన భార్యకు పెళ్లి కానుకగా రాజ్యాంగం ప్రతిని కూడా అందించాడు.