cricket: రసవత్తరంగా టీమిండియా, న్యూజిలాండ్ చివరి వన్డే
- కివీస్ టార్గెట్ 297 రన్స్
- స్కోరు 43 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు
- కళ్లెం వేసేందుకు ప్రయత్నిస్తున్న భారత బౌలర్లు
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనుయ్ లో జరుగుతున్న చివరి వన్డే ఆసక్తికరంగా మారింది. టీమిండియా విసిరిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 43 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. కివీస్ విజయానికి 42 బంతుల్లో 42 పరుగులు చేయాలి. చేతిలో 5 వికెట్లున్నాయి. ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ టామ్ లాథమ్ (24 బ్యాటింగ్), ఆల్ రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్ (24 బ్యాటింగ్) ఉన్నారు.
అంతకుముందు, కివీస్ ఓపెనర్లు ధాటిగా ఆడడంతో పరుగులు వేగంగా వచ్చాయి. మార్టిన్ గప్టిల్ (66), హెన్రీ నికోల్స్ (80) జోడీ తొలి వికెట్ కు 106 పరుగులు జోడించి శుభారంభం అందించింది. ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియమ్సన్ 22 పరుగులు చేసి అవుట్ కాగా, గత రెండు మ్యాచ్ లలో భారత్ అవకాశాలను దెబ్బతీసిన సీనియర్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ ఈసారి 12 పరుగులకే నిష్క్రమించాడు. టీమిండియా బౌలర్లలో లెగ్ స్పినర్ చహల్ 3 వికెట్ల తీయగా, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.