Pilli subhash chandra bose: మండలిలో ఆ రెండు బిల్లులు పాసైనట్టే లెక్క: పిల్లి సుభాష్ చంద్రబోస్ లాజిక్
- వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై వ్యాఖ్యలు
- ఆ బిల్లులను తిరస్కరించలేదు
- సెలెక్ట్ కమిటీలకు ఇక అవకాశం లేదు
- అంటే ఆమోదించినట్టేగా
ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీలు ఏర్పాటు అయ్యాయని ఓపక్క ప్రతిపక్ష నేతలు.. అసలు వాటిని ఏర్పాటు చేసేందుకే అవకాశం లేదని మరోపక్క అధికారపక్ష సభ్యుల వ్యాఖ్యలు హోరెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ లాజికల్ వ్యాఖ్యలు చేశారు.
ఈ బిల్లులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి, లేనిపక్షంలో సెలెక్ట్ కమిటీకైనా పంపించాలని, ప్రతిపక్షానికి వున్నవి ఈ మూడు ఆప్షన్సే అని అన్నారు. సెలెక్ట్ కమిటీ బాగోతం చూశాం కనుక, ఇక, దానికి అవకాశం లేదని, ఆ బిల్లులను తిరస్కరించడం కూడా చేయలేదు కనుక ఆమోదించినట్టే కదా? అని ఆయన లాజికల్ ధోరణిలో మాట్లాడారు. ఆ రెండు బిల్లులను తిరస్కరించకుండా, సెలెక్ట్ కమిటీకి పంపకుండా చేయడం ద్వారా రెండు మార్గాలను మూసేసుకున్నారు కనుక వాటిని ఆమోదించేసినట్టే అని, బిల్లులు పాసైనట్టే లెక్క అని చెప్పారు.