up: ఇది ప్రజాస్వామ్యం.. గొంతెత్తడం నేరం కాదు: ప్రియాంకాగాంధీ
- బాధితులకు అండగా నిలబడటం తన కర్తవ్యమని ట్వీట్
- యాంటీ సీఏఏ ఆందోళనకారుల కుటుంబాలను కలవనున్న ప్రియాంక
ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు తెలపడం, గొంతెత్తడం నేరం కాదని, బాధితులకు అండగా నిలవడం తన కర్తవ్యమని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. యూపీలోని ఆజంగఢ్ లో పోలీసులు అరెస్టు చేసిన యాంటీ సీఏఏ ఆందోళనకారుల కుటుంబాలను కలిసేందుకు వెళ్తూ ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
‘‘లోక్ తంత్ర మే ఆవాజ్ ఉఠానా జుల్మ్ నహీ హై. ఔర్ మేరా కర్తవ్య హై కి జిన్ కే సాత్ జుల్మ్ హో రహా హై మే ఉన్ కే సాత్ కర్తీ హూ (ప్రజాస్వామ్యంలో గొంతెత్తడం నేరమేమీ కాదు. బాధలకు గురవుతున్న వారికి అండగా నిలబడటం నా కర్తవ్యం)’’ అని పేర్కొన్నారు.