Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందనే వార్తలతో మార్కెట్లలో జోష్
- 350 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 93 పాయంట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందనే వార్తలతో పాటు ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 41,566కి ఎగబాకింది. నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 12,201 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (5.17%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.13%), నెస్లే ఇండియా (1.93%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.78%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.45%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.23%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.18%), సన్ ఫార్మా (-0.91%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.50%),