using drones to collect toll fees: కరోనా ఎఫెక్ట్: డ్రోన్లతో టోల్ ట్యాక్స్ వసూళ్లు
- క్యూ ఆర్ కోడ్ లు ప్రింట్ చేసిన బోర్డులు కార్ల వద్దకు..
- డ్రోన్ లను ఆపరేట్ చేస్తున్న టోల్ బూత్ సిబ్బంది
- దగ్గరగా వెళితే వైరస్ వస్తుందన్న భయంతోనే ఈ పద్ధతి
చైనాలో కరోనా వైరస్ భయం మరింతగా ముదురుతోంది. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఒకరికి ఒకరు దగ్గరగా నిలబడటానికి, తాకడానికి కూడా వెనుకాడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైరస్ ఎక్కువగా ప్రబలిన ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని షెంజెన్ నగరంలో ఉన్న ఎక్స్ ప్రెస్ హైవేపై టోల్ ట్యాక్స్ ను డ్రోన్లతో వసూలు చేస్తున్నారు. టోల్ బూత్ సిబ్బంది దూరంగానే నిలబడి.. క్యూ ఆర్ కోడ్ ను ప్రింట్ చేసిన బోర్డులను డ్రోన్లతో కార్ల వద్దకు పంపుతున్నారు. వాటిని స్కాన్ చేసి డబ్బులు కట్టాలంటూ ఆ బోర్డులపై రాసి పెట్టారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కాస్త దూరంగా ఉండేందుకు ఈ పద్ధతిని అనుసరిస్తున్నామని అధికారులు తెలిపారు.
.