AAP: కేజ్రీవాల్ క్రేజ్ మామూలుగా లేదు.. 24 గంటల్లో ఆప్ లో చేరిన 11 లక్షల మంది
- మిస్స్ డ్ కాల్ ఇవ్వండి.. పార్టీలో చేరండి అని పిలుపునిచ్చిన ఆప్
- భారీ ఎత్తున ప్రజాస్పందన
- ఇది తాము సాధించిన మరో ఘనత అని ఆప్ ప్రకటన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ... ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రికార్డులు సృష్టిస్తోంది. మిస్స్ డ్ కాల్ ఇవ్వండి, పార్టీలో చేరండి అంటూ ఆ పార్టీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 11 లక్షల మందికి పైగా ప్రజలు ఆప్ లో చేరారు. ఈ విషయాన్ని ఆప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. తాము ఘన విజయం సాధించిన 24 గంటల్లోనే మరో ఘనతను సాధించామని ట్వీట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 సీట్లను ఆప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.