indian army: సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు.. భారత పౌరుడు మృతి
- దీటుగా బదులిచ్చిన సైన్యం
- కశ్మీర్ లోని షాపూర్, కెర్ని సెక్టార్లలో దాడి
- కునైయన్ ప్రాంతంలో టెర్రరిస్టుల డంప్ లభ్యం
జమ్మూకశ్మీర్ లోని సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ కాల్పులకు దిగింది. శుక్రవారం ఉదయం ఫూంచ్ జిల్లాలోని షాపూర్, కెర్ని సెక్టార్ల పరిధిలో హఠాత్తుగా కాల్పులు మొదలుపెట్టింది. ఈ దాడిలో మన పౌరుడు ఒకరు మరణించినట్టు సైన్యం ప్రకటించింది. పాక్ కాల్పులు జరిపిన చోట సైన్యం వెంటనే అప్రమత్తమై.. దీటుగా బదులిచ్చిందని తెలిపింది. మన సైనికులెవరూ గాయపడలేదని పేర్కొంది.