Yemen: యెమెన్‌లో సౌదీ దళాల వైమానిక దాడులు.. 31 మంది మృతి

31 civilians killed in Yemen in Saudi led airstrikes
  • సౌదీ జెట్‌ను కూల్చివేసినట్టు ప్రకటించిన హౌతీ తిరుగుబాటుదారులు
  • ప్రతీకార దాడులకు దిగిన సౌదీ దళాలు
  • మరో 12 మందికి గాయాలు
యెమెన్‌పై సౌదీ దళాలు జరిపిన దాడిలో 31 మంది పౌరులు మృతి చెందారు. యెమెన్ ఉత్తర ప్రావిన్సులోని అల్ జాఫ్ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. సౌదీ నేతృత్వంలోని దళాలు జెట్ విమానాన్ని కూల్చేశాయి. అంతకుముందు రోజు సౌదీ జెట్ విమానం ఒకటి కూలిపోయింది. దీనిని తామే కూల్చేసినట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో సౌదీ ఈ ప్రతీకార దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 31 మంది పౌరులు మృతి చెందారని, మరో 12 మంది గాయపడ్డారని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. అయితే, సౌదీ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
Yemen
Houthis
Air raids
Saudi Arabia
Jet flight

More Telugu News