Tirumala: తిరుమలలో పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ
- 3 కంపార్టుమెంట్లలో భక్తులు
- నిన్న స్వామివారిని దర్శించుకున్న 89,359 మంది
- హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు
తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి గరిష్ఠంగా 3 గంటల్లోపే దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ఇక టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తుల దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 89,359 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 3.56 కోట్ల ఆదాయం లభించింది.