YS Jagan: సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కోసం ఏపీ పట్టు!

AP appeal center to send IPS offiece Stephen Ravindra to AP

  • వైఎస్సార్‌కు సన్నిహితుడిగా స్టీఫెన్‌కు పేరు
  • గతంలో కొంతకాలం ఏపీలో పనిచేసిన వైనం
  • స్టీఫెన్‌ను ఏపీకి పంపాలంటూ తాజాగా కేంద్రానికి లేఖ

వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడైన తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీకి తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన తర్వాత రవీంద్ర తెలంగాణకు పరిమితమయ్యారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏపీకి తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించాలని జగన్ ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించిన జగన్.. స్టీఫెన్ రవీంద్రను తమకు ఇవ్వాలని అభ్యర్థించారు.

కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణలో సెలవు పెట్టిన రవీంద్ర ఏపీకి వచ్చి కొన్నాళ్లపాటు అనధికారికంగా పనిచేశారు. ఆయనను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు. తాజాగా, ఢిల్లీ వెళ్లిన జగన్, స్టీఫెన్ రవీంద్ర విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. జగన్ అభ్యర్థనకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఆయనను రాష్ట్రానికి పంపాలని అభ్యర్థిస్తూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు అందడంతో స్టీఫెన్ రవీంద్ర ఏపీకి రావడం ఖాయమేనని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News