IYR Krishna Rao: పార్టీలకతీతంగా ఈ వార్త సారాంశం ఒకటే.. రెండు పార్టీలకు వర్తిస్తుంది: ఐవైఆర్ కృష్ణారావు

iyr krishnarao criticises ycp tdp

  • గ్రానైట్ లీజుల్లో రూ.వందల కోట్ల ఉల్లంఘనలు జరిగాయి
  • 57  క్వారీలకు తాఖీదులు ఇచ్చారని పత్రికల్లో వార్తలు
  • దోపిడీ చేయాలంటే అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేయాలన్న ఐవైఆర్
  • పరాయి వాడు అధికారంలోకి వస్తే మొదటికే మోసమని చురక

గ్రానైట్ లీజుల్లో రూ.వందల కోట్ల ఉల్లంఘనలు జరిగాయంటూ 57  క్వారీలకు తాఖీదులు ఇచ్చారని పత్రికల్లో వచ్చిన వార్తను ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పోస్ట్ చేశారు. బల్లికురవలో క్వారీ నిర్వహిస్తున్న బీజేపీ ఎంపీ గరికపాటి మోహనరావుకు రూ.285 కోట్ల జరిమానా విధిస్తూ నోటీసు జారీచేశారని, ఎమ్మెల్యే గొట్టిపాటి లీజుల్లో రూ.170 కోట్లకు తాఖీదు అని అందులో ఉంది. ప్రకాశం జిల్లాలో గనుల శాఖ అధికారుల తాఖీదులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'పార్టీలకతీతంగా ఈ వార్త సారాంశం ఒకటే. సహజ వనరులను దోపిడీ చేయాలంటే మనవాళ్లు అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేయాలి. పరాయి వాడు అధికారంలోకి వస్తే మొదటికే మోసం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్న రెండు పార్టీలకు, వారి లబ్ధిదారులకు వర్తిస్తుంది' అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News