YSRCP: బిల్లులు చెల్లించకుండా ఉపాధి నిధులు దారిమళ్లించారు: టీడీపీ

TDP filed pition on upadhi funds in highcourt

  • కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కూన, ఆలపాటి, యలమంచిలి
  • రూ.2500 కోట్లు దారిమళ్లించారని ఆరోపణ
  • బిల్లులు రాక బాధ్యులు ఇబ్బంది పడుతున్నారని ఫిర్యాదు

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి బిల్లులు చెల్లించకుండా ఆ నిధులు దారిమళ్లించిందని, ఈ కారణంగా నిధులు అందాల్సిన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం బేఖాతరు చేసిందని ఆరోపిస్తూ తెలుగుదేశం నేతలు కూన రవికుమార్, ఆలపాటి రాజా, యలమంచిలి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో మిస్‌లీనియస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాదాపు 2500 కోట్ల రూపాయలను ఇలా దారి మళ్లించారని, బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్తులు అమ్ముకుని చాలామంది నెట్టుకు రావాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, ఆ విధానాన్ని మాని ప్రజాస్వామ్యయుతంగా పాలించాలని, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News