Kodali Nani: డెఫినెట్ గా మండలి రద్దవుతుంది: ఏపీ మంత్రి కొడాలి నాని

Minister Kodali Nani says  Ap legislative counicl will dissolve definetly

  • రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంబంధాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయి
  • ప్రొసీజర్ ప్రకారం మండలి రద్దును కోరితే కచ్చితంగా జరుగుతుంది
  • టీడీపీ అడ్డుపడితే వాళ్లను ఆ దేవుడు కూడా రక్షించలేడు

రెండు నెలలు అటుఇటూగా ఏపీ శాసనమండలి రద్దు కావడం ఖాయమని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ని కలిసిన అనంతరం నాని  మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయని అన్నారు. ప్రొసీజర్ ప్రకారం మండలిని రద్దు చేయమని కేంద్రాన్ని కోరితే కచ్చితంగా జరిగి తీరుతుందని అన్నారు. ప్రభుత్వానికి సూచనలు చేయాల్సింది పోయి తాము తలపెట్టిన మంచి కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపడితే వాళ్లను ఆ దేవుడు కూడా రక్షించలేడని హెచ్చరించారు. ఢిల్లీలోని పెద్దలు కూడా వాళ్లను రక్షించే పరిస్థితి లేదని, ‘డెఫినెట్ గా మండలి రద్దవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News