Tirumala: ఇక పర్యావరణ ఏడుకొండలు.... తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం!
- అందుబాటులోకి గాజు బాటిల్స్
- నీటి అమ్మకాలన్నీ గ్లాస్ సీసాల్లోనే
- ఏడు కొండలపై సాధారణ రద్దీ
తిరుమలలో నేటి నుంచి ప్లాస్టిక్ కనిపించదు. పర్యావరణాన్ని పరిరక్షించేలా శబరిమల కొండపై తీసుకుంటున్న విధంగా తిరుమలలోనూ చర్యలు చేపట్టాలని గతంలోనే నిర్ణయించిన టీటీడీ, నేటి నుంచి ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించింది. ఇకపై గాజు బాటిల్స్ లోనే మంచి నీటిని విక్రయించాలని కొండపై ఉన్న అన్ని స్టాల్స్ యజమానులకూ ఆదేశాలు అందాయి. వీటిని పాటించకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరించింది.
కాగా, ఈ ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి గరిష్ఠంగా 4 నుంచి 6 గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం చేయిస్తున్నామని అన్నారు.