NABARD: గుంటూరు జిల్లా వాసికి అరుదైన గౌరవం.. నాబార్డు చైర్మన్‌గా చింతల గోవిందరాజులు
- చైర్మన్ పోస్టుకు గోవిందరాజులు పేరును సిఫారసు చేసిన బ్యాంక్ బోర్డు
- 24 ఏళ్ల తర్వాత తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
- 1985లో నాబార్డ్‌లో గ్రేడ్-బి అధికారిగా చేరిక
గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన చింతల గోవిందరాజులు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) చైర్మన్‌గా నియమితులు కానున్నారు. ఈ పదవికి గోవిందరాజులు పేరును సిఫారసు చేస్తూ బ్యాంక్స్ బోర్డు బ్యూరో నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టు కోసం మొత్తం 18 మంది పేర్లను పరిగణనలోకి తీసుకున్న బోర్డు.. చివరికి గోవిందరాజుల పేరును ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
నాబార్డ్ చైర్మన్‌గా ఓ తెలుగు వ్యక్తికి అవకాశం దక్కడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో కోటయ్య చైర్మన్‌గా వ్యవహరించారు. 1985లో నాబార్డ్‌లో గ్రేడ్-బి అధికారిగా చేరిన గోవిందరాజులు ప్రస్తుతం నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. లక్నోలోని బీఐఆర్‌డీ డైరెక్టర్‌గా, న్యాబ్‌ఫిన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గానూ సేవలు అందించారు.