Nara Lokesh: ప్రైవేటు సంస్థలు పోయాయి.. ఇప్పుడు ప్రభుత్వ సంస్థల వంతు వచ్చింది: నారా లోకేశ్
- తుగ్లక్ నిర్ణయంతో నిన్నటి దాకా ప్రైవేటు పెట్టుబడులు పోయాయి
- ఆంధ్రుడు ఏం పాపం చేశాడు?
- తరలిపోతున్న ఓఎన్జీసీ కథనాన్ని షేర్ చేసిన లోకేశ్
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన తుగ్లక్ నిర్ణయంతో నిన్నటి దాకా ప్రైవేటు పెట్టుబడులు పోయాయని... ఇప్పుడు ప్రభుత్వ సంస్థల వంతు వచ్చిందని అన్నారు. ఈ అపఖ్యాతిని మూటగట్టుకోవడానికి ఆంధ్రుడు ఏం పాపం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతోపాటు ఓ వార్తా పత్రికలో వచ్చిన 'తరలిపోతున్న ఓఎన్జీసీ... ఆపరేషన్ల నిలిపివేత' కథనాన్ని షేర్ చేశారు.