Venkatesh: రెడ్ డెసర్ట్ లో 'నారప్ప' పోరాటం
- తమిళనాట విజయవంతమైన 'అసురన్'
- 'నారప్ప' టైటిల్ తో తెలుగు రీమేక్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
మొదటి నుంచి కూడా వెంకటేశ్ రీమేక్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఆయన ఎంచుకున్న రీమేక్ చిత్రాలలో చాలా వరకూ ఆయనకి విజయాలనే అందించాయి. తాజాగా ఆయన తమిళ మూవీ 'అసురన్'కి రీమేక్ గా 'నారప్ప' సినిమా చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ప్రోగ్రెస్ గురించి దర్శకనిర్మాతలు మాట్లాడుతూ .. "తమిళనాడులో తిరుచందూర్ సమీపంలో గల 'తెరికాడు'లో కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరించాము. అక్కడ 12000 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశాన్ని 'రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు' అంటారు. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ 27 రోజుల పాటు చిత్రీకరించాము. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కనిపిస్తుంది" అని చెప్పారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే.