Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కోసం లైన్లో మారుతి, సుజీత్

Vijay devarakonda Movie
  • మైత్రీ వారితో విజయ్ దేవరకొండ
  • పూరి సినిమా తరువాత పట్టాలెక్కనున్న ప్రాజెక్టు 
  • దర్శకుడి విషయంలో రానున్న క్లారిటీ  
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ వారు ఆ మధ్య  'హీరో' సినిమాను మొదలెట్టారు. 10 కోట్ల వరకూ ఖర్చు చేసిన తరువాత షూటింగు ఆగిపోయింది. కారణమేదైనా ఇదే బ్యానర్లో మరో సినిమాను చేస్తానని మైత్రీ మూవీ మేకర్స్ వారికి విజయ్ దేవరకొండ మాట ఇచ్చాడట. దాంతో నిర్మాతలు రంగంలోకి దిగినట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలోనే వాళ్లకి మారుతి - సుజీత్ ఇద్దరూ మంచి కథలను వినిపించారట. ఈ కథలను విజయ్ దేవరకొండ కూడా వినవలసి వుంది. ఈ ఇద్దరిలో ఎవరు వినిపించిన కథ నచ్చితే వాళ్లతో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పూరి సినిమా తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు.
Vijay Devarakonda
Maruthi
Sujeeth

More Telugu News