New Delhi: ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ తీసుకుని భోజనం పెడతారు.. ఢిల్లీలో వినూత్న హోటల్
- దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
- 250 గ్రాముల ప్లాస్టిక్ కు టిఫిన్లు.. కిలో ప్లాస్టిక్ తెస్తే ఫుల్ మీల్స్
- ప్లాస్టిక్ వేస్ట్ ను నియంత్రించడమే లక్ష్యం
హోటల్ కు వెళితే ఏం చేస్తారు.. భోజనం చేసి డబ్బులు ఇచ్చి వస్తారు కదా.. కానీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ కు వెళితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే హోటల్ కు వెళ్లేటప్పుడు మీ ఇంట్లో ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ వస్తువులు, సామాన్లు తీసుకెళ్తే చాలు. ఆ వేస్ట్ ప్లాస్టిక్ తీసుకుని భోజనం పెడతారు. ప్లాస్టిక్ వేస్ట్ ను రీసైక్లింగ్ కు అనుగుణంగా సేకరించడం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం లక్ష్యంగా దక్షిణ ఢిల్లీలో వినూత్నంగా ఈ హోటల్ ను ఏర్పాటు చేశారు.