India: ఒవైసీ సభలో 'రచ్చ' చేసిన అమ్మాయి అమూల్యపై దేశద్రోహం కేసు.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి చిక్కుల్లో పడ్డ అమ్మాయి
- మండిపడ్డ యడియూరప్ప
- బెయిలు కోసం అమూల్య దరఖాస్తు
- న్యాయమూర్తి నిరాకరణ
పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) నిరసనగా బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో అమూల్య అనే అమ్మాయి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. దీంతో ఆమె బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయమూర్తి నిరాకరించారు. అంతేకాదు, 14 రోజుల పాటు ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమె చిక్కుల్లో పడింది.
సభలో ఆమె చేస్తోన్న వ్యాఖ్యలకు షాక్ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆమె నుంచి మైక్ లాక్కుందామని ప్రయత్నించినా, ఆమె వదలకుండా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయింది. అమూల్యకు బెయిలు ఇవ్వద్దని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. అమూల్య వ్యాఖ్యలపై ఆమె తండ్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. అమూల్యకు నక్సల్స్‌తో సంబంధం ఉందన్న విషయం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు.