Pakistan: పోలీసులు నా కూతురి కాళ్లు విరగ్గొట్టినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు: అమూల్య తండ్రి
- నా కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యా
- ఆమెను జైల్లో పెట్టినా నో ప్రాబ్లం
- ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని చాలాసార్లు చెప్పా
- నా కూతురిలో ఎలాంటి మార్పు రావట్లేదు
బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) నిరసనగా నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో అమూల్య అనే అమ్మాయి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి ఈ విషయంపై స్పందించారు.
తన కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన చెప్పారు. ఆమెను జైల్లో పెట్టినా, పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని తాను ఆమెకు చాలా సార్లు చెప్పానని, అయినప్పటికీ తన కూతురిలో ఎలాంటి మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆమెను జైల్లోంచి తీసుకురావడానికి తానే న్యాయవాదులను సంప్రదించబోనని స్పష్టం చేశారు. కాగా, ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.