Cricket: కివీస్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన రికార్డు!

Ross Taylor is a rare record

  • మూడు ఫార్మాట్లలోనూ వందేసి మ్యాచ్ లు ఆడిన ప్లేయర్
  • ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా గుర్తింపు 
  • భారత్ తో తొలి టెస్టుతో ఈ ఫీట్

న్యూజిలాండ్ వెటరన్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ వందేసి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. భారత్ తో శుక్రవారం మొదలైన తొలి టెస్టుతో అతను ఈ మార్కు అందుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో ఇప్పటికే వందేసి మ్యాచ్ లు ఆడేసిన టేలర్ కు ఇది వందో టెస్టు. ఈ సందర్భంగా తన పిల్లలతో కలిసి మైదానంలోకి వచ్చిన రాస్ ను సహచరులు అభినందించారు.

కాగా, టెస్టులు, వన్డేల్లో న్యూజిలాండ్ నుంచి టాప్ స్కోరర్ గా ఉన్న టేలర్.. రెండు ఫార్మాట్లలో కలిపి నలభై సెంచరీలు సాధించాడు. ఇప్పటిదాకా 231 వన్డేలు ఆడిన రాస్ 8,570 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వంద అంతర్జాతీయ టీ20ల్లో 1909 పరుగులు రాబట్టిన ఈ వెటరన్ క్రికెటర్ ఖాతాలో ఏడు హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే, 99 టెస్టుల్లో 19 సెంచరీలు, 33 అర్ధ శతకాలతో 7,174 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News