Donald Trump: సబర్మతీ ఆశ్రమంలో గాంధీ చరఖాపై నూలు వడికిన ట్రంప్.. మూడు కోతులను చూసి ముచ్చట పడ్డ ట్రంప్ దంపతులు

trump visits india

  • నరేంద్ర మోదీతో కలిసి సబర్మతీ ఆశ్రమానికి ట్రంప్
  • గాంధీజీ చిత్రపటానికి దంపతుల నివాళి 
  • ట్రంప్ దంపతులకు భారత ప్రజల ఘన స్వాగతం 

భారత్‌లో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. వారితో పాటు ఆశ్రమం వద్ద గుజరాత్‌ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. ఆశ్రమంలో గాంధీజీ చిత్రపటానికి నూలు దండ వేసి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో గాంధీ చరఖాను తిప్పి ట్రంప్ నూలు వడికారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో ఉన్న మూడు కోతుల బొమ్మలను ట్రంప్‌ దంపతులు చూసి ముచ్చటపడ్డారు.
                
అంతకు ముందు ఎయిర్‌పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమం వరకు ట్రంప్ దంపతులకు భారత ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ రోడ్డుకి ఇరు వైపులా నిలబడ్డారు. సబర్మతీ ఆశ్రమం సందర్శించుకున్న తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలవకు మెతెరా స్టేడియంలో జరగనున్న నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ట్రంప్, మోదీ హాజరవుతారు.


  • Loading...

More Telugu News