Narendra Modi: భారత శక్తి సామర్థ్యాలపై ట్రంప్ అభిప్రాయాలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
- భారత్– అమెరికా మైత్రీ బంధం మరింత దృఢపడింది
- ఇదికొత్త తీరాలకు చేరుతుంది
- రక్షణ, ఐటీ, ఫార్మా, అంతరిక్ష రంగాల్లో అమెరికా– భారత్ భాగస్వాములు
భారత శక్తి సామర్థ్యాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో ట్రంప్ ప్రసంగం ముగిసిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. స్వామి వివేకానంద, మహాత్మాగాంధీలను ట్రంప్ ప్రస్తావించారని, మన దేశ గౌరవాన్ని ఇనుమడించేలా ఆయన ప్రసంగం ఉందని కొనియాడారు. మోతెరా స్టేడియం ప్రపంచంలోని అతిపెద్దదని, దీని నిర్మాణం ఇంకా పూర్తి కాకున్న ట్రంప్ ఇక్కడికి వచ్చారని ప్రశంసించారు.
‘నమ్మకం ఎక్కడుంటుందో.. స్నేహం అక్కడే ఉంటుంది’ అని, భారత్–అమెరికాల మధ్య ఉన్నవి అవేనని అన్నారు. భారత్– అమెరికా మైత్రీ బంధం మరింత దృఢపడిందని, ఇదికొత్త తీరాలకు చేరుతుందని ఆకాంక్షించారు. భారత్ కు ఇవాళ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా అని, రక్షణ, ఐటీ, ఫార్మా, అంతరిక్ష రంగాల్లో అమెరికా– భారత్ భాగస్వాములని అన్నారు. గతంలో శ్వేతసౌధంలో దీపావళి పండగ నిర్వహించడాన్ని భారతీయులకు గర్వకారణంగా అభివర్ణించారు.