jubilee hills: ఆత్మరక్షణ కోసం 'తుపాకి'తో తిరుగుతున్న బస్తీనేత.. అసలు విషయం తెలిసి పోలీసుల అవాక్కు!

Banjara Hills police arrested gully leader

  • జూబ్లీహిల్స్ సింగాడబస్తీలో ఘటన
  • వారం రోజుల క్రితం నాటి ర్యాలీ ఫొటోలు బయటకు
  • స్థానిక నేత ఇజాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

జూబ్లీహిల్స్‌లోని సింగాడబస్తీకి చెందిన స్థానిక నేత ఇజాజ్ అహ్మద్‌పై రెండు నెలల క్రితం కొందరు కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన ఇజాజ్ చికిత్స అనంతరం కోలుకున్నాడు. వారం రోజుల క్రితం బస్తీకి వెళ్లగా స్థానికులు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ ఫొటోల్లో ఇజాజ్ ప్యాంటులో తుపాకి ఉన్నట్టు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తుపాకిని తీసుకుని పరిశీలించగా అది బొమ్మ తుపాకి అని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తనకు ప్రాణభయం ఉండడంతోనే దానిని వెంట పెట్టుకుని తిరుగుతున్నట్టు చెప్పాడు. అయితే, మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని పోలీసులు అతకి నచ్చజెప్పి పంపించారు.

  • Loading...

More Telugu News