Guntur District: ఆడుకుంటూ సూదిని మింగిన చిన్నారి.. వెంటనే బయటకు తీసిన వైద్యులు!
- గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
- 8 నిమిషాల్లోనే బయటకు తీసిన వైద్యులు
- ఎండోస్కోపి విధానం ద్వారా చికిత్స
ఓ చిన్నారి (4) ఆడుకుంటూ సూదిని మింగేసిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా, వైద్యులు అత్యాధునిక శస్త్ర చికిత్సా పద్ధతి ద్వారా కేవలం ఎనిమిది నిమిషాల్లోనే దాన్ని బయటకు తీశారు. దీంతో ఆ చిన్నారికి ఏ ప్రమాదం జరగలేదు.
ఆ చిన్నారి గుంటూరు జిల్లాలోని పొత్తూరివారితోటకు చెందిన అబేదుల్లా కూతురు మహ్మద్ షిమా. ఆడుకుంటోన్న సమయంలో ఆమె సూదిని మింగిందని అబేదుల్లా తెలిపాడు. గుంటూరు ఆసుపత్రిలో వైద్యులు ఆ చిన్నారి కడుపులోని సూదిని ఎండోస్కోపి విధానం ద్వారా బయటకు తీశారు. ఆమె శరీరంలో ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు.