IYR Krishna Rao: భారత్‌లో ట్రంప్ పర్యటనపై ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు
- భారత దేశ ప్రయోజనాల దృష్ట్యా ఫలవంతమైన పర్యటన
- సీఏఏను అంతర్గత అంశంగా పేర్కొనడం మంచి పరిణామం
- వాణిజ్యం విషయంలో వెసులుబాటు ఎవరికీ ఇవ్వడని అర్థం అయ్యింది
భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన 36 గంటల పర్యటనపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో మనదేశ ప్రాధాన్యాన్ని అమెరికా గుర్తించడం మంచి పరిణామమని ఆయన ట్వీట్ చేశారు.
'భారత దేశ ప్రయోజనాల దృష్ట్యా ఫలవంతమైన పర్యటన. రక్షణ సహకారం, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో భారత ప్రాధాన్యాన్ని అమెరికా గుర్తింపు.. మంచి పరిణామాలు. సీఏఏ, ఢిల్లీ సంఘటనలను అంతర్గత అంశాలుగా ట్రంపు పేర్కొనడం మంచి పరిణామం. వాణిజ్యం విషయంలో ప్రత్యేక వెసులుబాటు ట్రంపు ఎవరికీ ఇవ్వడని అర్థం అయ్యింది' అని ఆయన అభిప్రాయపడ్డారు.