delhi police: ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్‌గా శ్రీవాత్సవ నియామకం
- మంగళవారం రాత్రి నియామకం
- ఆందోళనలు అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు
- ఉత్తర ఢిల్లీలో హింసలో ఇప్పటికి 13 మంది మృతి
సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీలో పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీస్ శాంతి భద్రతల విభాగం ప్రత్యేక కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ఎన్ శ్రీవాత్సవను నియమించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేయగా.. శ్రీవాత్సవ వెంటనే రంగంలోకి దిగారు. గతంలో ఢిల్లీ పోలీస్ అత్యున్నత ప్రత్యేక విభాగానికి (ఎలైట్ స్పెషల్ సెల్) ఆయన నేతృత్వం వహించారు.
కాగా, ఉత్తరఢిల్లీలో అల్లర్లు చల్లారలేదు. రెండు గ్రూపులు పరస్పరం రాళ్లు విసురుకోవడంతో పాటు దుకాణాలకు నిప్పు పెట్టారు. ఈ హింసలో ఇప్పటిదాకా ఓ పోలీసు సహా 20 మంది చనిపోయారు. మరో 200 మంది వరకు గాయపడినట్టు సమాచారం. ఉత్తర ఢిల్లీలోని జఫ్రాబాద్, మాజ్పుర్, భజన్‌పురా, ఛాంద్ బాగ్, కరవాల్ నగర్‌లోని వీధుల్లో భారీ హింస చోటు చేసుకుంది. దుకాణాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు కర్రలు, రాడ్లతో రోడ్లపై తిరుగుతూ బీభత్సం సృష్టించారు.