KTR: ఇతర మంత్రులతో కలిసి చికెన్ లెగ్ పీసులు లాగించిన కేటీఆర్

TS ministers KTR and Talasani attends chicken mela

  • కరోనా భయంతో పడిపోయిన చికెన్ అమ్మకాలు
  • దేశవ్యాప్తంగా కుంగిపోయిన పౌల్ట్రీ పరిశ్రమ
  • అపోహలు తొలగించేందుకు ముందుకొచ్చిన తెలంగాణ మంత్రులు
  • సందడి చేసిన కేటీఆర్, తలసాని, ఈటల తదితరులు

చికెన్ తింటే కరోనా వైరస్ సోకుతుందన్న వదంతులతో దేశవ్యాప్తంగా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. కిలో కోడిమాంసం రూ.80కి ఇస్తామన్నా ప్రజలు వెనకాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రజల్లో చికెన్ పట్ల ఉన్న అపోహను తొలగించేందుకు తెలంగాణ మంత్రులు ముందుకు వచ్చారు.

పౌల్ట్రీ సమాఖ్య, నెక్ సంయుక్తంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చికెన్ మేళాలో కేటీఆర్, తలసాని, ఈటల తదితరులు ఎంచక్కా మసాలా దట్టించిన చికెన్ లెగ్ పీసులు భోంచేశారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ కు, చికెన్ కు ఎలాంటి సంబంధం లేదని, నిరభ్యంతరంగా తినొచ్చని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అన్నారు.

  • Loading...

More Telugu News