Kim Jong Un: ఉత్తర కొరియాలోకి కరోనా వస్తే అధికారుల తాట తీస్తా: కిమ్ వార్నింగ్

Kim Jong Un Warns Officeials over Corona

  • దాదాపు 60 దేశాలకు విస్తరించిన కరోనా
  • కొరియాలోకి వస్తే అధికారులకు కఠిన శిక్షలు
  • సరిహద్దులు మూసి వేయాలని కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలు
  • విమానాలు, అంతర్జాతీయ రైళ్లు రద్దు

ఇప్పటికే దాదాపు 60 దేశాలకు విస్తరించి, ఒక్క అంటార్కిటికా మినహా మిగతా అన్ని ఖండాలకూ విస్తరించిన కోవిడ్ -19 (కరోనా వైరస్) మహమ్మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న వేళ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, తన దేశపు అధికారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఇంతవరకూ కరోనా వైరస్ తమ దేశంలోకి రాలేదని గుర్తు చేసిన ఆయన, దేశంలోకి వైరస్ వ్యాపిస్తే, వైద్య ఆరోగ్య అధికారులు కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వుంటుందని, అది మరణ దండన కూడా కావచ్చని హెచ్చరించారు. సరిహద్దులు దాటి ఈగను కూడా దేశంలోకి రానివ్వవద్దని, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలనూ తీసుకోవాలని ఆయన అన్నారు.

ఉత్తర కొరియా సరిహద్దులన్నీ మూసి వేయాలని, కరోనా ప్రభావం తగ్గేంత వరకూ దేశంలోని పౌరులెవరూ విదేశాలకు వెళ్లరాదని, విదేశాల్లోని వారెవరికీ దేశంలోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో ఉన్న ఉత్తర కొరియన్లను కూడా దేశంలోకి అడుగు పెట్టనివ్వరాదని ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ రైళ్లను, విమానాలను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ఉత్తర కొరియాకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లయింది.

  • Loading...

More Telugu News