Australia: అదే జోరు... శ్రీలంకపైనా మహిళా క్రికెటర్ల విజయ దుందుభి!

India beets srilanka in world women t20 cricket

  • టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ మెరుపులు
  • వరుసగా నాలుగో విజయం
  • ఇప్పటికే సెమీస్‌కు చేరిన జట్టు

మహిళ క్రికెట్‌ టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఈరోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ జట్టు సభ్యులు విజయకేతనం ఎగురవేసి వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్‌లోనే కంగుతినిపించిన భారత్‌ జట్టు బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌ జట్లపై కూడా సునాయాస విజయాలతో సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈరోజు శ్రీలంకతో జరిగిన గ్రూప్‌-ఎ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మన జట్టు సభ్యులు విజయ దుందుభి మోగించారు.

114 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని (116 పరుగులు) చేరుకుంది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. 34 బంతుల్లో 47 పరుగులు చేసి షఫాలీ వర్మ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

కాగా, తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఏసీ జయంగాని 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాధాయాదవ్ నాలుగు వికెట్లు తీసుకోగా.. గైక్వాడ్ రెండు వికెట్లు, డి.బి.శర్మ, ఎస్.పాండే, పూనమ్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.

  • Loading...

More Telugu News