Virat Kohli: కోహ్లీ సెల్ఫిష్​ కెప్టెన్.. రివ్యూ వేస్ట్​ చేసినందుకు అభిమానుల ఆగ్రహం!

Netizens lashes out at Virat Kohli for wasting a review

  • తొలి ఇన్నింగ్స్‌లో రెండు రన్స్‌కే ఔటైన విరాట్
  • ఎల్బీడబ్ల్యూ  చేసిన టిమ్‌ సౌథీ
  • బాల్‌ లైన్‌లోనే ఉన్నా డీఆర్‌‌ఎస్‌ కోరి ఫెయిలైన కెప్టెన్‌
  • రివ్యూల విషయంలో విరాట్‌కు చెత్త రికార్డు 

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. టీ20 సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీ తర్వాత వన్డే సిరీస్‌తో పాటు టెస్టుల్లోనూ తడబడుతూనే ఉన్నాడు. మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫెయిలైన కోహ్లీ.. శనివారం మొదలైన సెకండ్‌ మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు.

లంచ్‌కు ముందు 15 నిమిషాల పాటు వికెట్‌ కాపాడుకున్న భారత కెప్టెన్‌ బ్రేక్‌ నుంచి వచ్చిన వెంటనే ఔటై పెవిలియన్ చేరాడు. టిమ్‌ సౌథీ వేసిన స్ట్రయిట్ బాల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే, ఈ ఎల్బీడబ్ల్యూకు విరాట్‌ డీఆర్‌‌ఎస్‌ కోరడం చర్చనీయాంశమైంది. కానీ, బంతి వికెట్లను తగులుతున్నట్టు స్పష్టంగా తెలియడంతో థర్డ్ అంపైర్‌‌ కూడా ఔటిచ్చాడు.

అయితే, లైన్‌ కరెక్ట్ ఉన్నా.. బ్యాట్‌ను బంతి తగలకపోయినా కూడా రివ్యూ కోరడంపై అభిమానులు, నెటిజన్లు విరాట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వికెట్‌ కాపాడుకునేందుకు అతను సెల్ఫిష్ గా వ్యవహరించాడని విమర్శిస్తున్నాడు. అప్పటికే భారత్‌ ఓ రివ్యూ కోల్పోగా.. చేతిలో మరో ఏడు వికెట్ల సమయంలో బాధ్యతాయుత కెప్టెన్‌ అయితే రివ్యూ వేస్ట్ చేసి ఉండాల్సింది కాదని అంటున్నారు.

డీఆర్‌‌ఎస్‌ల విషయంలో కోహ్లీకి ఇప్పటికే చెత్త రికార్డు ఉంది. టెస్టు క్రికెట్‌లో ఇప్పటిదాకా అతను 14 రివ్యూలు కోరితే కేవలం రెండు సార్లు మాత్రమే సక్సెస్‌ అయ్యాడు. దాంతో, గతంలో కోహ్లీ రివ్యూల్లో ఫెయిలైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న నెటిజన్లు కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News