TTD: టీటీడీ వార్షిక బడ్జెట్​ కు ఆమోదం.. జమ్మూకశ్మీర్, ముంబై, కాశీలో శ్రీవారి ఆలయాలు

TTD Annual Budget

  • 2‌020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,309 కోట్ల అంచనాలతో బడ్జెట్
  • ఆమోదం తెలిపిన పాలక మండలి  
  • ఆలయాల్లో భద్రత కోసం 1300 సీసీ కెమెరాల కొనుగోలుకు నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వార్షిక బడ్జెట్ కు పాలకమండలి (బోర్డు) ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 2‌020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,309 కోట్ల అంచనాలతో రూపొందించిన వార్షిక బడ్జెట్ కు బోర్డు ఆమోదం తెలిపిందని అన్నారు. బూందీపోటులో అగ్ని ప్రమాదాల నివారణకు రూ.3.30 కోట్లు, బర్డ్ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాల రూపకల్పనకు రూ.8.50 కోట్లు, చెన్నైలోని పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ.3.92 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.

బర్డ్ ఆసుపత్రిలో కొత్త ఉద్యోగాల భర్తీకి, టీటీడీలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు, టీటీడీ పరిధిలోని ఆలయాల్లో భద్రత కోసం 1300 సీసీ కెమెరాల కొనుగోలుకు, టీటీడీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్, ముంబై, కాశీలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపిందని అన్నారు. అలిపిరి వద్ద ద్విచక్రవాహనాలకు రుసుం మినహాయింపు, తిరుమలకు వచ్చే అన్ని రకాల వాహనాల టోల్ ధరలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు.

  • Loading...

More Telugu News