America: తాలిబన్లు, అమెరికా మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం
- తాలిబాన్లు, అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
- ఖతార్ లోని దోహాలో శాంతి ఒప్పందంపై సంతకాలు
- ఖతార్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు హాజరైన భారత రాయబారి
తాలిబాన్లు, అమెరికా మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాలను అమెరికా క్రమంగా ఉపసంహరించుకోనుంది. ఖతార్ లోని దోహాలో శాంతి ఒప్పందంపై తాలిబన్, అమెరికా ప్రతినిధులు ఈరోజు సంతకాలు చేశారు.
ఆఫ్ఘన్ భూభాగం నుంచి తొలి 135 రోజుల్లో అమెరికా తమ బలగాలను 8,600కి తగ్గించనుంది. 14 నెలలలోపు పూర్తిగా అమెరికా బలగాలు అక్కడి నుంచి వైదొలగుతాయి. కాగా, ఈ ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమానికి అమెరికా, పాకిస్థాన్, చైనా, ఆఫ్ఘనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, ఇండోనేషియా, తాలిబాన్ ప్రతినిధుల బృందం సహా పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఖతార్ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత రాయబారి పి.కుమారన్ హాజరయ్యారు.