Covid-19: కరోనా ఎఫెక్ట్! ఇరాన్ పౌరులకు వీసా నిలిపివేసిన భారత్
- ‘కరోనా’ విషయంలో భారత్ అప్రమత్తం
- చైనా తర్వాత ఎక్కువ కేసులు ఇరాన్‌లోనే
- ఇరాన్ పౌరులు దేశంలోకి అడుగుపెట్టకుండా చర్యలు
కరోనా వైరస్ (కోవిడ్-19) విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర ఈ వైరస్ దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇరాన్ పౌరులు దేశంలోకి అడుగుపెట్టకుండా వీసాల జారీ ప్రక్రియను నిలిపివేసింది. చైనా తర్వాత కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నది ఇరాన్‌లోనే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘కరోనా’ కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు 43 మంది ప్రాణాలు కోల్పోగా, 600 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.