Italy: ఇటలీలో వారం రోజులుగా చిక్కుకుపోయిన 85 మంది భారత విద్యార్థులు

Indian Students Trapped in Italy

  • ఇటలీలో చిక్కుకున్న వారిలో 25 మంది తెలంగాణ విద్యార్థులు
  • విమానాల రద్దు కారణంగా స్వదేశానికి రాలేక అవస్థలు
  • స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని అభ్యర్థన

ఇటలీలో వారం రోజులుగా చిక్కుకున్న భారతీయ విద్యార్థులు సాయం కోసం ఎదురు చూస్తూ పడిగాపులు కాస్తున్నారు. కరోనా వైరస్ (కోవిడ్-19) కారణంగా ఇటలీలో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ మరింత ప్రబలకుండా చర్యలు తీసుకుంది. విమాన సర్వీసులను రద్దు చేసింది. దీంతో స్వదేశానికి వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ విమాన సర్వీసులు రద్దు కావడంతో పావియా పట్టణంలో చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.

మరోవైపు వారు చదువుకుంటున్న పావియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ విభాగంలో ఓ విద్యార్థిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో విద్యార్థులు భయంతో గడుపుతున్నారు. పరిస్థితులు మరింత విషమించకముందే భారత ప్రభుత్వం తమకు సాయం అందించి స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేయాలని బాధిత విద్యార్థుల్లో ఒకరైన బెంగళూరుకు చెందిన అంకిత ప్రభుత్వాన్ని అర్థించింది.

ఇటలీలో చిక్కుకున్న 85 మంది భారత విద్యార్థుల్లో 25 మంది తెలంగాణ విద్యార్థులు కాగా, 20 మంది కర్ణాటక, 15 మంది తమిళనాడు, నలుగురు కేరళ, ఇద్దరు ఢిల్లీ విద్యార్థులు ఉండగా, రాజస్థాన్, గురుగ్రామ్, డెహ్రాడూన్ నుంచి ఒక్కో విద్యార్థి చొప్పున ఉన్నారు.

  • Loading...

More Telugu News