Corona Virus: కరోనాకు గొప్ప విరుగుడు సబ్బే.. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త
- సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వైరస్‌ను నివారించొచ్చు
- వైరస్ చుట్టూ ఉండే కొవ్వుతో కూడిన పొరను సబ్బు తొలగిస్తుంది
- పొర తొలగిపోతే వైరస్ చచ్చిపోతుంది
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మన దరికి చేరకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ప్రొపెసర్, శాస్త్రవేత్త కారెన్ ఫ్లెమింగ్ వివరించారు. కేవలం సబ్బును ఉపయోగించి ఈ మహమ్మారిని దూరంగా ఉంచొచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై సబ్బు గొప్ప ఆయుధంగా పనిచేస్తుందని తెలిపారు. కరోనా వైరస్ చుట్టూ కొవ్వుతో కూడిన పలుచని పొర ఉంటుందని, సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఆ పొర తొలగిపోతుందని అంటున్నారు. సబ్బునీటికి అంతటి శక్తి ఉందని, ఆ పొర తొలగిపోయిన వెంటనే వైరస్ చనిపోతుందని ఆమె వివరించారు.