Chiranjeevi: 'లూసిఫెర్' రీమేక్ దర్శకుడిగా వినాయక్?
- మలయాళంలో హిట్ కొట్టిన 'లూసిఫెర్'
- వైవిధ్యభరిత చిత్రంగా ప్రశంసలు
- చరణ్ చేతికి తెలుగు రీమేక్ హక్కులు
మోహన్ లాల్ కథానాయకుడిగా రూపొందిన 'లూసిఫెర్' క్రితం ఏడాది మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 200 కోట్లకుపైగా వసూలు చేసింది. మెహన్ లాల్ కెరియర్లోనే వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. అలాంటి ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్నాడు.
చిరంజీవి కథానాయకుడిగా ఆయన ఈ సినిమాను నిర్మించడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను వినాయక్ కి అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో చిరంజీవి వున్నట్టుగా చెబుతున్నారు. గతంలో చిరంజీవితో వినాయక్ చేసిన 'ఠాగూర్' ..'ఖైదీ నెంబర్ 150' సినిమాలు భారీ విజయాలను దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలు రీమేక్ లే. అందువలన చిరంజీవి .. వినాయక్ వైపు మొగ్గుచూపుతున్నారట. దాదాపు ఈ అవకాశం వినాయక్ కే వెళ్లొచ్చని చెప్పుకుంటున్నారు.