Krithi Garg: ప్రభాస్ పక్కన నటించాలంటూ ఫోన్ కాల్... ముంబయి వెళ్లి ఆచూకీ లేకుండాపోయిన హీరోయిన్

Heroine Krithi Garg missing as director complains police
  • 'రాహు' చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతి గార్గ్
  • ముంబయి రావాలంటూ సందీప్ వంగా పేరుతో ఫోన్ కాల్
  • ముంబయి వెళ్లిన కృతి
  • ఆమె ఫోన్ కలవడం లేదంటూ రాహు దర్శకుడి ఫిర్యాదు
టాలీవుడ్ లో 'రాహు' అనే చిత్రంలో నటించిన కృతి గార్గ్ ఆచూకీ దొరకడం లేదంటూ చిత్ర దర్శకుడు సుబ్బు వేదుల పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటించాలంటూ కృతిగార్గ్ కు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా పేరుతో ఫోన్ కాల్ వచ్చిందని, దాంతో కృతి ముంబయి వెళ్లిందని సుబ్బు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టోరీ వినేందుకు అర్జంటుగా రావాలని ఆమెకు ఫోన్ లో సూచించారని, అయితే, ముంబయి వెళ్లినప్పటి నుంచి ఆమె ఫోన్ కలవడంలేదని, ఆమె ఆచూకీపై ఆందోళనగా ఉందని దర్శకుడు తెలిపారు.
Krithi Garg
Rahu
Subbu Vedula
Prabhas
Sandeep Vanga
Arjun Reddy
Mumbai
Panjagutta Police
Hyderabad

More Telugu News