Sensex: ఓ దశలో 900 పాయింట్లకు పైగా లాభపడి.. చివర్లో పడిపోయిన సెన్సెక్స్
- వరుసగా ఆరో రోజు నష్టపోయిన మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 153 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు నష్టపోయాయి. ఈ రోజు ఇంట్రాడేలో మార్కెట్లు దూసుకుపోయాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరైపోయి, చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 38,144కు పడిపోయింది. నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 11,132కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.36%), నెస్లే ఇండియా (2.28%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.80%), ఇన్ఫోసిస్ (1.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.05%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-5.17%), టాటా స్టీల్ (-4.65%), హీరో మోటో కార్ప్ (-3.81%), బజాజ్ ఆటో (-3.26%), ఓఎన్జీసీ (-3.05%).